Site logo

Blog

Sep 01
కాంగ్రెస్ నాయకులవి శవ రాజకీయాలు – దేశిని కోటి

జమ్మికుంట: (మన జమ్మికుంట) ఈరోజు కొత్తపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ హమాలీ సంఘం అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజ ఆరోగ్యం కోసం కష్ట పడుతున్నా మంత్రి గారిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం ఏక వచనంగా మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారితో ఎలా వుండాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని తెలవని వారు ఒక గౌరవ ప్రజా మంత్రి అయినటువంటి […]

Aug 31
Bulk SMS 20% off

Promote your business and get leads immediately with bulk SMS service. we are offering promotional and transactional SMS on offer. Buy 20000 and more SMS get 20% off. Limited offer valid upto 30th, September, 2020 only. Contact 9154545254 for more details.

Aug 28
విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం

జమ్మికుంట: విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం.  

Aug 18
మంత్రి ‘ తుఫాను ‘ పర్యటన

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక […]

Aug 18
జమ్మికుంట స్మశాన వాటిక కి ప్రభుత్వం నిధులు కేటాయించాలి – ఆర్యవైశ్య సంఘం

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక స్మశావాటిక నీరుతో నిండి పోయింది. మరణించిన వారి అంత్యక్రియలు చేయడం కష్టంగా మారుతుంది. దీనిపై జమ్మికుంట, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు, బచ్చు శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఊరికి ఇరువైపులా స్మశాన వాటికలు ఉండాలని ఎంతో ఆర్భాటంగా, నిధులు కేటాయించినప్పటికీ, “జమ్మికుంట పట్టణ నడిబొడ్డున ఆర్యవైశ్య ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి స్మశాన వాటిక” ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, […]

Aug 10
శ్రీమతి ఈటల జమున రాజేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి సతీమణి శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారికి జన్మ దినం పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Aug 10
తెలంగాణా గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోషియేషన్ (TGGDA) రాష్ట్ర కార్యదర్శిగా డా.రవి ప్రవీణ్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిన్న ఆదివారం (తేదీ 09.08.2020) రోజు హైదరాబాద్ లో జరిగింది.నూతన కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా నుండి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి కి చోటు దక్కింది.నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి ప్రస్తుత కరోనా సమయంలో డాక్టర్స్ మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన […]

Aug 06
కేసిఆర్ కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్న హామీ వెంటనే నెరవేర్చాలి – కాంగ్రెస్ నేతలు

ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణ కేంద్రంలో కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. పత్తి కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ “2014 సంవత్సరం లో సీఎం కేసిఆర్ కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తా అని చెప్పిన కేసిఆర్ కి గుర్తు చేస్తూ 2017 లో కరీంనగర్ జిల్లా నడి బొడ్డున మెడికల్ కాలేజీ కోసం టిపిసిసి వర్కింగ్ […]

Aug 06
ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ పై నిరసన తెలిపిన విద్యార్థి సంఘ నాయకులు

జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ కు నిరసనగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వయించడం జరిగింది అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అక్రమంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మారాగపు చర్య అని పేర్కొనడం జరిగింది ఇది నిర్మాణం జరిగితే ఇందులో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని విద్యార్థి సంఘనాయకులు అయినటువంటి NSUI జిల్లా కో-ఆర్డినేటర్ […]

Aug 04
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి 15 లక్షల 125 కె.వి. జనరేటర్ సదుపాయం

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో […]