జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ కు నిరసనగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వయించడం జరిగింది అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ
జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అక్రమంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మారాగపు చర్య అని పేర్కొనడం జరిగింది
ఇది నిర్మాణం జరిగితే ఇందులో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని విద్యార్థి సంఘనాయకులు అయినటువంటి NSUI జిల్లా కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు జమ్మికుంట స్టూడెంట్ JAC మండల అధ్యక్షులు కాసర్ల ప్రవీణ్ కుమార్. AISF జిల్లా కోశాధికారి మాదారపు రత్నాకర్ మాట్లాడుతూ ఈ యొక్క పబ్లిక్ టాయిలెట్స్ కట్టడాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేస్తాం అని తెలిపారు.