Site logo

జమ్మికుంట స్మశాన వాటిక కి ప్రభుత్వం నిధులు కేటాయించాలి – ఆర్యవైశ్య సంఘం

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక స్మశావాటిక నీరుతో నిండి పోయింది. మరణించిన వారి అంత్యక్రియలు చేయడం కష్టంగా మారుతుంది. దీనిపై జమ్మికుంట, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు, బచ్చు శివకుమార్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఊరికి ఇరువైపులా స్మశాన వాటికలు ఉండాలని ఎంతో ఆర్భాటంగా, నిధులు కేటాయించినప్పటికీ, “జమ్మికుంట పట్టణ నడిబొడ్డున ఆర్యవైశ్య ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి స్మశాన వాటిక” ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, “ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా స్మశాన వాటిక కేటాయించలేదు. ‘”

ప్రభుత్వం వైఫల్యం వల్ల, నాయిని చెరువు నాలా( వాగు) సరిగా లేకపోవడం వలన ఈరోజు వరదనీటిలో శవాలను కాల్చడం జరిగింది, ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మేము ప్రతి స్మశాన వాటిక కి నిధులు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడమే, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, నిధులు కేటాయించి స్మశాన వాటికను సుందరంగా తయారుచేయాలని డిమాండ్ చేశారు.

Comments

  • No comments yet.
  • Add a comment