తేదీ; 09-09-2020
కరీంనగర్ జిల్లా జమ్మికుంట
అసెంబ్లీ సమావేశంలో విఆర్వో వ్యవస్థ రద్దు పై బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేసిఆర్, కేటీఆర్, ఈటెల చిత్ర పటాలకు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసిన టిఅర్ఎస్ నాయకులు.
అనంతరం కాళోజీ జయంతి పురస్కరించుకొని కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు.
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ
అవినీతి నిర్మూలనే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా VRO వ్యవస్థ రద్దు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని, రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక రైతు బిడ్డగా వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారని, అలాగే కాళోజీ తన రచన లతో తెలంగాణ కు జరిగిన అన్యాయాలను ఎలిగెత్తి చాటి చైతన్యం తీసుకు వచ్చాయని, వారి జీవనం అందరికీ స్ఫూర్తి దాయకం అని అన్నారు.
ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్ , జడ్పిటిసి శ్రీ రామ్ శ్యామ్, పి ఎ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ గారు,వైస్ చైర్మన్, అన్ని వార్డ్ ల కౌన్సిలర్లు పట్టణ ముఖ్య నాయకులు, టి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.