Site logo

బిజిగిర్ షరీఫ్ దర్గా దర్శనం చేసుకున్న ఐఎన్టియుసి అధ్యక్షుడు బాబర్ సలీం పాషా

తేదీ 07-09-2020 సోమవారం రోజున ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహమతుల్లా అలై దర్గాను దర్శించుకున్న రామగుండంకి చెందిన ఐఎన్టియుసి అధ్యక్షుడు బాబర్ సలీం పాషా మరియు ఆయన సతీమణి అయిన రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ షకీనా బేగం కుటుంబ సభ్యులతో దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
దర్గాలో ముస్లింల మత గురువు గులాం యాసీన్, మౌలానా నౌమాన్ హాష్మి, ఖాజా పాష గార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు….
హజ్రత్ ఆమీనా బీబీ దర్గా, హజ్రత్ అఫ్జల్ బి దర్గాలలో ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి చేయించినందుకు దర్గా కమిటీ బాబర్ సలీం పాషా గారికి కృతజ్ఞతలు తెలిపింది… దర్గా కమిటీ వీరికి శాలువాతో, పూవ్వులదండలతో ఘనంగా సన్మానించింది…

ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షులు అబ్దుల్ కరీం, మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్ కార్యదర్శి మొహమ్మద్ మహముద్, కోశాధికారి అబ్దుల్ హమీద్, సంయుక్త కార్యదర్శి మహముద్, దర్గా ముజావర్లు సర్వర్, నయీముద్దీన్, లతీఫ్ హుస్సేన్, హైదర్,అల్తాఫ్ ఇమ్రాన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు…

Comments

  • No comments yet.
  • Add a comment