Site logo

మంత్రి ‘ తుఫాను ‘ పర్యటన

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ…





గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటిచామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూర్ చెరువు, ఈదుల గట్టపల్లి లో చెరువు ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం గంగారం, ఏల్బాక, చల్లూరు, వల్భపూర్, కేశవపురం లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. చెక్ డాంలను పరిశీలించారు.

సోమవారం హుజురాబాద్ లో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి వరద పరిస్థితిపై సమీక్షించారు. ఆ తరువాత కరీంనగర్ జిల్లా కలెక్టరు శశాంక తో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం లో పలు చెరువులను మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.
కమలాపూర్ మండలం ఉప్పల్, కమలాపూర్, శంబునిపల్లి, వంగపల్లి లో చెరువులు, వాగులు, మునిగిపోయిన పొలాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పంట పొలాలు మునిగిన రైతులు, ఇల్లు కూలిన రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు.
ఇళ్ళందకుంట మండలం మల్యాల బ్రిడ్జి, మల్యాల, ఇళ్ళందకుంటలలో పర్యటించారు.
జమ్మికుంట మండలం లో నాయిని చెరువు కట్టను పరిశీలించిన మంత్రి పటిష్ఠతపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్ .. కొన్ని ప్రాంతాల ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి, ఈ వర్షాలతో వాగులు వంకలు పోగడమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. ఇంత తక్కువ కాలంలో, ఇంత పెద్ద ఎత్తున వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన సంఘటన అన్నింటిని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ సహకారాలు అందిస్తాము. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని కావలసిన సహకారాలు అందిస్తాము.
రైతాంగానికి పంట నష్టం పై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు.
ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్నంచోట ప్రజలను షెల్టర్ లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలి అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
అనంతరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, నష్ట ప్రభావంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం కు హాజరయ్యేందుకు హుజురాబాద్ నుండి హైదరాబాద్ బయలదేరి వెళ్ళారు.

Comments

  • No comments yet.
  • Add a comment