Raithu Bazaar in Jammikunta
ఇందుమూలముగా సమస్త జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత పజలకు తెలియజేయునది ఏమనగా వచ్చే బుధవారం అనగా తేది: 18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ (నూతన జమ్మికుంట కూరగాయల మార్కెట్) లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మరియు బయట ఎక్కడ కూడా కూరగాయలు క్రయవిక్రయాలు జరపకుండా చూసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్, పద్మావతి, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్, పోలీసు శాఖ వారిని ఈ రోజు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీయుత అడిషనల్ కలెక్టర్, శ్యాం ప్రసాద్ లాల్ గారు ఆదేశించినారు. కావున జమ్మికుంట పట్టణ ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించగలరు.