హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.
హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో ఇబ్బంది పడకూడదనే తపనతో మంత్రి ఈటెల రాజేందర్ గారు మా అభ్యర్థనను మన్నించి వెంటనే 15 లక్షల ఖర్చుతో, 125 కె.వి జనరేటర్ ఏరియా ఆస్పత్రి హుజురాబాద్ కు నేడు ఇవ్వడం జరిగిందని, మంత్రి ఈటెల రజేందర్ గారికి అలాగే దీనికి గాను కృషి చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక్ IAS గారికి ధన్యవాదాలు తెలియ జేశారు.