Site logo

నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్ & ఉర్స్ ఉత్సవాలు…

కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు…

ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది..

ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం కేవలం దర్గా ముజావర్ లతో సంథల్&ఉర్స్ ఉత్సవాలను నిర్వహించడం జరిగినది…

దర్గా భక్తులకు తేదీ 02-08-2020 ఆదివారం నుండి నిత్య దర్శనం ఉంటుందని దర్గా కమిటీ తమ ప్రకటనలో తెలిపారు…

దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో దర్గా ముజావర్లు దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహ్మతుల్లాహ్ అలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావళీ, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళీ, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావళీ సమాధులకు సంథల్ అలరింపజేశారు.

హైదరాబాద్ నుండి తెప్పించిన ప్రత్యేక చాదర్లు దర్గాలోని సమాధులకు అలంకరించారు… ముస్లింల మత గురువు జనాబ్ యాసిన్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు…
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జనాబ్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ గారు, బిజిగిర్ షరీఫ్ గ్రామ సర్పంచ్ రాచపల్లి.సదయ్య గారు, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యదర్శి మహమూద్, కోశాధికారి అబ్దుల్ హమీద్, సంయుక్త కార్యదర్శులు మహమ్మద్ షాహుస్సేన్, బాబా, సర్వర్, జాఫర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్దుల్ అషు సభ్యులు తజ్ మున్ హుస్సేన్, సాధక్, సర్వర్, తాజ్, తో పాటు దర్గా ముజావర్ లు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment