ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విధ్యార్ధులు మరియు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెప్టెంబర్ 06, 07 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాలను స్థాపించి ఎన్నో వేల మంది విద్యావంతులు కావడానికి కారణం అయినా స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహం కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ చైర్మన్ ప్రో. N.రామ స్వామి, ప్రస్తుత కాలేజీ ప్రిన్సిపాల్ కలకుంట రామ కృష్ణ, అసోసియేషన్ వైస్ ఛైర్మన్స్ ఎం.ఏ. హుస్సేన్, టి.సుధాకర్ రెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు, కళాశాల అధ్యాపక బృదం పాల్గొనడం జరిగింది.