Site logo

రానున్న సంవత్సర కాలంలో జమ్మికుంట, హుజురాబాద్ లను మోడల్ టౌన్స్ గా అభివృద్ది చేద్దాం – సిడీఎంఏ సమావేశంలో ఈటెల

హైదరాబాద్ :
మసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశం అయిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ గారు హాజరయ్యారు.

  • రెండు మున్సిపాలిటీలలో ఉన్న సమస్యలు పరిష్కారం, మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయినా కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని కోరిన మంత్రి.
  • మంత్రి గారి విజ్ఞప్తి మేరకు అన్ని విభాగాల అధికారులతో ఒక టీం ను ఏర్పాటు చేసిన అరవింద్ కుమార్, వచ్చే వారంలో రెండు పట్టణాలు పర్యటించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు.
  • వచ్చే 6 నెలల్లో హుజురాబాద్ జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తామన్న మంత్రి.
  • టౌన్ లో ఉన్న పెద్ద రోడ్స్ అన్నిటికీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్,డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, పార్క్, ఫుట్ పాత్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్,వెజిటబుల్, నాన్ వెజ్, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డు, చెరువుల సుందరీకరణ, టాంక్ బండ్ ల నిర్మాణం, పందుల రీహాబిలిటేషన్, రింగ్ రోడ్డు నిర్మాణాల పై దృష్టి పెట్టాలని కోరిన మంత్రి. ఒక సంవత్సరం లో మోడల్ టౌన్ చూడాలన్న మంత్రి.
  • హుజురాబాద్, జమ్మికుంట రెండు పట్టణాలు రెండు కళ్ళ లాంటివి. రెండు పట్టణాలు పెద్ద రోడ్లు వేసి పెట్టాము. 2014 లోనే తాగునీటి కోసం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాము. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 40 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశాను. వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టండి. నిధులు కొరత లేదు అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మార్పు కనిపించేలా అభివృద్ది చేయాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్.
  • పట్టణాల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ నీరు నిలవకుండా చూడండి. దోమల కు నిలయాలుగా మార్చవద్దు. నీళ్ళు నిలవడం అంటే అది కాన్సర్ పుండు లాంటిదే.. ప్రాణాలు తీస్తుంది.
  • రోడ్లు, డ్రెయిన్లు, టౌన్ ప్లానింగ్ రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా తయారు చేయాలి తప్ప తాత్కాలికంగా పనులు చేయవద్దు అని మంత్రి ఆదేశించారు.

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ స్వప్న, కమిషనర్ రషీద్.
హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, వైస్ చైర్మన్ నిర్మల , కమిషనర్ జోనా లు పట్టణాల్లో ఉన్న సమస్యలను వివరించారు.

Comments

  • No comments yet.
  • Add a comment