Site logo

Category: Flash News

Jan 07
ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలు

స్థానిక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలను ఈటెల జనసేన మరియు TRSV ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణి చేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈటెల జనసేన 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమన్నారు. ఈటెల జనసేన ఏర్పాటుకు సహకరించిన వారందరికీ అలాగే దీని వ్యవస్తాపక అద్యక్షులు ఎనగంటి నరేష్ యాదవ్ […]

Sep 20
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు

వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sep 17
గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

తేదీ 17-09-2017 గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం జమ్మికుంట టౌన్: నిన్న జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, తాడ్వాయి మండలం, లవ్వాలా గ్రామ సమీపంలో నివసిస్తున్న 200 మంది దళిత గిరిజన కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి చెట్టుకు కట్టేసి మహిళలను సైతం చూడకుండా చిత్రహింసలు చేశారని, ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం […]

Sep 15
జమ్మికుంట లో నిత్య జనగణమనకు ముప్పయి రోజులు

జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]

Sep 15
రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో RDO

రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో కరీంనగర్ జిల్లా RDO

Aug 24
జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్

తేదీ 22-08-2017జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్ నిర్వహించిన నగర పంచాయితీ చైర్మన్, సిబ్బంది మరియు టీఆర్ఎస్ నాయకులు

Aug 19
సర్వాయి పాపన్న 367 జయంతి ఉత్సవాలు

సర్వాయి పాపన్న 367 జయంతి ఉత్సవాలు ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల మీదుగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 200 బైకులతో ర్యాలి నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు అంబటి రమేష్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంనకు జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, సెక్రటరీ జనరల్  ముఖ్య అతిథులుగా అతిథులుగా పాల్గొన్నారు. 

Aug 19
మహానాడు ముఖ్యనాయకుల సమావేశం

ఎస్సీ వర్గీకరణ సమస్యను ఎమ్మార్పీఎస్ నాయకులు విడనాడాలని రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ మాల మహానాడు ముఖ్యనాయకుల సమావేశం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మాల మాదిగలు కలిసి కలిసి ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.