Site logo

నరేంద్ర మోడీ బహిరంగ సభ సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి .

జమ్మికుంట టౌన్:
భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జులై 3వ తేదీ రోజున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4-00 గంటలకు జరిగే బహిరంగ సభకు నరేంద్రమోదీ రావడం జరుగుతుందని,కావున జమ్మికుంట పట్టణం 39 బూత్ లోని ప్రతి బూత్ నుండి 30 మందికి పైన రావాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బహిరంగ సభ ఖర్చు కోసం ప్రతీ బూత్ నుండి కార్యకర్తలు 1000 నిధి ఇవ్వాలని అన్నారు. బహిరంగ సభకు సంబంధించిన సమాచారాన్ని బూత్ లోని అన్ని ఇండ్లకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోరే రవీందర్, ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్ దొంతుల రాజ్ కుమార్ పల్లపు రవి, ఇటుకల స్వరూపా, ఎదులాపురం అశోక్, మోతే స్వామి, కోలకని రాజు, అప్ప మధు, మోడె0 రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment