Site logo

Blog

Jan 27
జమ్మికుంట లో 29.01.2018 న రక్త దాన శిబిరం

🙏 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో   తేదీ.29.01.2018 సోమవారం రోజున  ఉదయం 9 గంటలకు  పచ్చిక శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ పైన అంతస్తు జమ్మికుంట లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రక్త దానం చేయండి. వీలైనంత మంది చేత రక్త దానం చేయించండి. ….. 👉రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే […]

Jan 26
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ […]

Jan 26
బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు

బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులుముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్,  హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ […]

Jan 08
తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన  T MASS FORUM జమ్మికుంట మండల కమిటి ఆద్వర్యంలో సైదాబాద్ గ్రామంలో పర్యటించినట్లు గ్రామంలోని స్థానిక సమస్యలు ప్రజలు టీ మాస్ బృందం దృష్టికి తీసుకొచ్చినట్లు మండల కన్వీనర్ శీలం అశోక్ తెలిపారు .మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ,వెంటనే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ,అలాగే అర్హులైన పేదలకి ఇంటి నివేశన స్థలాలకి […]

Jan 07
మంత్రిగారి సహకారంతో కొత్తపల్లి గ్రామపంచాయితి పరిధిలోని గ్రామస్తులకు ఇండ్ల నిర్మాణానికి కృషి … తక్కళ్ళపల్లి

కొత్తపల్లి గ్రామ పంచయతిలోని TRS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సహకార సంఘాల రాష్ట్ర అద్యక్షులు శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు హాజరై గ్రామంలోని అభివృధి కార్యక్రమాలు సమస్యలపై పరిష్కారానికి మంత్రి గారైన శ్రీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గతనెల 25వ తేదీ క్రిస్మస్ రోజున మంత్రిగారు ఎప్కోలు చర్చికి అభివృధికై హామీ ఇచ్చారు. ఈ హామీని త్వరలోనే నేరవేరుస్తారని […]

Jan 07
Happy New Year 2018

Lighten up your surroundings with your sweet smile and make way for happiness with your good deeds this New Year. Happy 2018. manajammikunta.com

Jan 07
ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలు

స్థానిక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలను ఈటెల జనసేన మరియు TRSV ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణి చేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈటెల జనసేన 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమన్నారు. ఈటెల జనసేన ఏర్పాటుకు సహకరించిన వారందరికీ అలాగే దీని వ్యవస్తాపక అద్యక్షులు ఎనగంటి నరేష్ యాదవ్ […]

Dec 01
జమ్మికుంట వాసులకి కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్న ఔషధ ప్రయోగం.

లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ దిష్టి బొమ్మ దగ్దం -జిల్లా అధ్యక్షులు కనకం నరేష్ నేడు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆద్వర్యంలో లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీనిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కనకం నరేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాది కల్పనకోసం హైదరాబాద్ వెళ్ళిన చిలివేరి అశోక్ కుమార్ పై ఔశాదాలను ప్రయోగించి నిరుద్యోగులను ఆసరా చేసుకొని డబ్బులను ఎర […]

Dec 01
జమ్మికుంట విస్ డమ్ కళాశాల ఆద్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో […]