Site logo

బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు

బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు
ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్,  హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ అలీ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంరెడ్డి, జమ్మికుంట M.P.D.O రమేష్, సెక్షన్ ఫారెస్ట్ అధికారి సదాశివ రెడ్డి  దర్గా వద్ద ఉన్న గుట్టల దగ్గర జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసారు.
ఈ సందర్భంగా D.F.O శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ మంత్రి గారి ఆదేశాల మేరకు జింకల పార్క్ దర్గా వద్ద మంజురైనదని దీని కొరకు స్థల పరిశీలన చేసి అధికారులతో అంచనాలు తయారు చేసి జింకల పార్క్ కొరకు ఎంత నిధులు అవసరమున్నది అని నివేదక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజిగిరిషరీఫ్ గ్రామ సర్పంచ్  కె .యుగందర్ రెడ్డి, జమ్మికుంట మండల కో.ఆప్షన్ సభ్యులు సయ్యద్ సమీర్, మండల సర్వేయర్ రాజేశం, గ్రామ V.R.O P.యాదగిరి, బిజిగిరి షరీఫ్ దర్గా కమిటి అధ్యక్షులు మహ్మద్ చోటేమియా, ఉపాధ్యక్షుడు యం.డి. అబ్దుల్ కరీం, కార్యదర్శి మహ్మద్ ఇక్బాల్, సభ్యులు నయిముద్దీన్, అహ్మద్, షాహుస్సేన్, లాల్ మహ్మద్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు .

Comments

  • No comments yet.
  • Add a comment