Site logo

పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – సి.ఐ. ప్రశాంత్ రెడ్డి

పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

మన ప్రియతమ జమ్మికుంట పోలీసులు మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సర ప్రారంభ ఘడియల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి వారికి కావలిసిన పుస్తకాలు,పెన్నులు, వాటర్ బాటిల్స్, కంపాక్స్ బాక్సలు, బ్యాగులు కొని పరీక్షల అనంతరం వాటిని పాత సామానులు కొనే వారికి, ఉల్లి గడ్డలు అమ్మేవారికి, పాత పేపర్లు కొనే వారికి అతి చవక ధరలకు అమ్మి వేస్తుంటాము.. వాటిని అమ్మగా వచ్చే సొమ్ము ఎంత అతి తక్కువగా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా సులువుగా ఒక విలువైన మన పిల్లల జీవితాన్ని తీర్చి దిద్ధేందుకు సంవత్సరం అంతా సావాసం చేసిన అట్టి విలువైన పుస్తకానికి చాలా సులువుగా చరమ గీతం పాడుతున్నాము.
దయామయులైన తల్లిదండ్రులరా ఒక్కసారి ఆలోచిద్దాం.తమ పిల్లలకు పుస్తకాలు కొనలేని తల్లిదండ్రులు కూడా మన చుట్టూ ఉంటారని గుర్తిద్దాం, వారికి వారి పిల్లలకు మన పిల్లలు ఉపయోగించి అవసరం తీరిన పుస్తకాలను ఇతర సంబంధిత పరికరాలను, వస్తువులను మన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్న పుస్తకానికి పునర్జన్మనిచ్చే ప్రదేశంలో జమ చేసి మన పిల్లల పుస్తకాలకు కూడా పునర్జన్మనిచ్చి పిల్లలకే కాదు పుస్తకాలకు పున: జీవనం ఇచ్చి వాటికీ తల్లిదండ్రులుగా మారుదాం. లేని వారికి ఈ విధంగా చేయుతను అందిద్దాం.. మన పిల్లలకి చేదోడు వాదోడుగా ఉన్న పుస్తకాలకు పునర్ వైభవం ప్రసాదిద్దాం, మన ప్రియతమ పోలీసు సోదరుల నూతన ఆలోచనకు బాసటగా నిలుద్దాం!

Comments

  • No comments yet.
  • Add a comment