Site logo

పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం – జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం

కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్  వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా.

 పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం.

  • ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం…
  • ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు..
  • ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం..
  • ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమాలాసన్ రెడ్డి.

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ సిపి కమాలాసన్ రెడ్డి మాట్లాడుతూ

మార్కులు, ర్యాంకులతో ఉద్యోగాలు రావచ్చు కానీ, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవడం చిన్నతనం నుండే విద్యార్థులకు విద్యాసంస్థలు నేర్పించాలి..
విద్యార్థులు 10వ తరగతి అయిపోయే వరకు సెల్ ఫోన్స్ వాడవద్దు.. పుస్తకాలను చడవడమే వారి యొక్క ముఖ్యమైన లక్ష్యం..
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. కాబట్టి మిగిలిన అన్నమును పారవేయ్యకుండా నిరు పేదలకు పంచండి…
తల పిరికెడు బియ్యం తీసుక వస్తేనే ఈ రోజు 70 క్వీన్టల్స్ బియ్యం సమకూరింది.. అలానే ఎవరికైనా సమస్య వస్తే అందరం కలిసి సహకరిస్తే వారి సమస్యలను తీర్చవచ్చును.

Comments

  • No comments yet.
  • Add a comment