Site logo

జమ్మికుంట వాసులకి కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్న ఔషధ ప్రయోగం.

లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ దిష్టి బొమ్మ దగ్దం
-జిల్లా అధ్యక్షులు కనకం నరేష్
నేడు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆద్వర్యంలో లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
దీనిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కనకం నరేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాది కల్పనకోసం హైదరాబాద్ వెళ్ళిన చిలివేరి అశోక్ కుమార్ పై ఔశాదాలను ప్రయోగించి నిరుద్యోగులను ఆసరా చేసుకొని డబ్బులను ఎర వేస్తూ ఔశాదాలను విచ్చలవిడిగా నిరుద్యోగులపై ప్రయోగాత్మకంగా ప్రయోగిచడం సిగ్గుచేటు అన్నారు. ఇంతకుముందు లోటాస్ ఫార్మా కంపెనీ ఔషద ప్రయోగానికి గురి అయిన నాగంపేట వాసి వంగర నాగ రాజు జూన్ 2 న ఔశాదాలను ప్రయోగించడం ద్వారానే మృతి చెందడం జరిగిందనీ ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో పురోగతిని సాధించకముందే ఆరు నెలల్లో మరొకరిపై ఔషదాలను ప్రయోగించడం సరి అయినది కాదు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగానే యువత ఉద్యోగ ఉపాది అవకాశాల కల్పన కోసం బయటకి వెళ్లి ప్రాణాలమీడకి తేచుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు .ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిoచి విచ్చలవిడిగా ఔషదాల కంపెనీలకు అనుమతులు ఇవ్వకూడదని అన్నారు .జూన్ 2 న మృతి చెందిన నాగరాజు కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రే షియ ఇవ్వాలని అదేవిధంగా చిలివేరి అశోక్ కుమార్ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు .లోటాస్ సంజేనీ ఫార్మా కంపెనీ యాజమాన్యంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఇట్టి కంపెనీలను సీజ్ చేయాలని డిమాండ్ చేసారు .లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్య పరిరక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు చల్లారి రాహుల్ మరియు కోటి ,కిషోర్ ,రమేష్ ,మధు పాగ్లోన్నారు .

Comments

  • No comments yet.
  • Add a comment