Site logo

జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక దళిత ఆదివాసి అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సహసోపేత మైన నిర్ణయాలు ఎన్నో చేసిన ఎస్ఆర్ శంకరన్ ఒక ఒక్క సంవత్సరంలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్లను జారీ చేసిన ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భంగా మిగిలిపోయారు ఎస్సీ ఎస్టీ నిరుపేద బిడ్డలకు గురుకుల పాఠశాలలను 1984లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఒప్పించి సుమారు 50 నుండి 60 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి వేలాది నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత ఆయనకే దక్కింది అదే స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతుల పిల్లలు నాణ్యమైన విద్య కొరకై సుమారు 900 గురుకులాల ఏర్పాటు చేసి లక్షలాదిమంది నిరుపేద పిల్లలను ప్రపంచ స్థాయికి పోటీపడే విధంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా గురుకులాల పిల్లలను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు అదేవిధంగా ఆదివాసి ముద్దుబిడ్డ స్వర్గీయులు కొమురం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదంపై పోరాటం చేసి అసలు బాషారు నేటి సమాజమంతా కొమురం భీము ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేరుతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని హర్షనీయమని తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కు ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ కోడిగుటి మొగిలయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, నోముల కేశవరెడ్డి,జీడి లక్ష్మణ్,అంబాల (పల్లె) రాజయ్య టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు అంబాల రాజు, యువ నాయకులు బండారి ప్రశాంత్, మార్క స్వరాజ్ మహమ్మద్ బషీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

– అన్వర్ బాబు, సీనియర్ రిపోర్టర్, జమ్మికుంట, సెల్: 9154545254

Comments

  • No comments yet.
  • Add a comment