జమ్మికుంట పూర్వం ‘పెసరు బండగా’ పిలువ బడేది. ప్రస్తుతం ఆబాది / పాత జమ్మికుంట గా పిలువ బడుతున్న జమ్మికుంట మాత్రమే ఉండేది. ఇప్పటి రైల్వే స్టేషన్ దగ్గరలో చిన్న కొండలు పెసరు రంగులో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పెసరు బండ ప్రాంతంగా పిలవడం జరిగింది. కాల క్రమేనా ఈ ప్రాంతలో రైల్వే లైన్ పడటం, స్టేషన్ ఏర్పడటం వాళ్ళ స్టేషన్ జమ్మికుంట గా రూపాంతరం చెందింది. తదుపరి రవాణా సౌకర్యాలు, వలసల కారణంగా స్టేషన్ జమ్మికుంట అభివృద్ధి చెంది, పెసరు బండ ప్రాంతం జమ్మికుంట గా పాత జమ్మికుంట ఆబాది జమ్మికుంట గా మారి పోయింది.
చరిత్ర:
చారిత్రాత్మక ఆధారాల పరంగా ఈ ప్రాంతాన్ని ఆహోమల్లప్ప దేవ (తైలప్ప దేవ -2) దమ్ముకుంట ( ప్రస్తుత ఆబాది జమ్మికుంట) ప్రాంతంలో శివాలయాన్నిఆదిత్య దీప వ్రిక్ష తో కలిసి నిర్మించాడని చెప్పబడింది. ఇది మంజరాజు(మాల్వ సామ్రాజ్యం లోని పరమార అధిపతి) పై విజయానికి చిహ్నంగా ఈ దేవాలయాన్ని నిర్మించాడని చెప్పబడుతున్నది. ఈ ఆలయంలో జ్యోతిర్లింగాలు కలవు. దీనిని క్రీ.శ. 995 A.D. ఏప్రిల్ 5 వ తేదిన పూర్హి చేయబడి ప్రారంభించ బడిందని చరిత్ర కారుల అంచనా. కాల క్రమేనా ధమ్ముకుంట జమ్మికుంట గా రూపాంతరం చెందింది.