జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జమ్మికుంట తాసిల్దార్ నారాయణ మాట్లాడుతూ
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించుటకు చర్యలలో భాగంగా శ్రీయుత కలెక్టర్, కరీంనగర్ గారి సూచనల మేరకు తేది: 29.03.2020 రోజున జమ్మికుంట పట్టణములోని కిరాణ షాపు / సూపర్ మార్కెట్ / వర్తక సంఘం సభ్యులు / యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో జమ్మికుంట పట్టణ ప్రజలు ఎక్కువగా కిరాణ షాప్/ సూపర్ మార్కెట్ / వర్తక సంఘం వద్ద గుమ్మికూడకుండా ఉండుటకు గాను ఇంటికి నేరుగా సరుకులు సరఫరా చేయుటకు తెలియజేయనైనది.
ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని, అది కూడా కనీసం మీటరు దూరంలో ఉంటూ కావల్సిన వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు.
కావున ఇట్టి సేవలను జమ్మికుంట మునిసిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకొనవలసినదిగా కోరనైనది. ఇట్టి సమావేశమునకు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి, హైదరాబాదు గారు మరియు మునిసిపల్ చైర్ పర్సన్ గారు హాజరైనారు
సాయిరాం సూపర్ మార్కెట్ – జి.హరీష్ రావు – 9849129126
తనీష్ ఫుడ్ వరల్డ్ – పి. సురేశ్ – 7013078878
బిగ్ మార్ట్ – శ్రీధర్ – 9000310410
రావికంటి బక్కయ్య కిరాణం – ఆర్.రాజా – 9849111148