ఉచిత విద్య, నాణ్యమైన విద్య మరియు ప్రతీ సంవత్సరం అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి. చేర్పించండి.
జమ్మికుంట పట్టణ & పరిసర ప్రాంత విద్యాభిమానులకు, పోషకులకు నమస్సుమాంజలులు.. గత 60 సంవత్సరాలుగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, విద్యార్థుల ప్రతిభను వికసింపజేస్తూ విశిష్టమైన రీతిలో బోధనచేస్తూ విజయతీరాల వైపు చేర్పిస్తున్న కళాశాల “ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట”
SSC లో అత్యధిక మార్కులు సాధించిన వారిని, సహజంగా ప్రతిభ కల్గిన వారిని ఉత్తీర్ణులను చేయడం కాదు. అతితక్కువ మార్కులు వచ్చినవారిని సైతం ఉత్తీర్ణులను చేయడమే మా లక్ష్యం.
వేలు,లక్షలు ఖర్చుపెట్టి ప్రయివేటు, కార్పొరేటు కళాశాలలో చదివి అత్యధిక మార్కులు సాధిస్తున్న కొద్దిమంది మాదిరిగా కాకుండా మా కళాశాలలో చదివి పట్టణ, రాష్ట్రస్థాయిలోనే టాపర్స్ గా నిలుస్తున్న మా విద్యార్థులే నిదర్శనం.
మా కళాశాల ప్రత్యేకతలు:-
*అర్హత, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో,మంచి ప్రణాళికతో విద్యాబోధన.
*4ఎకరాల స్థలం కల్గి అందులో విశాలమైన తరగతి గదులు. ప్రశాంతమైన చక్కటి కళాశాల వాతావరణం.
*గ్రంథాలయం నుండి ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలు & మెటీరియల్ ఉచితంగా పంపిణీ.
*ఏ కళాశాలకు లేని అత్యాధునిక ప్రయోగశాలు. SC, ST, BC విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం.ఉచిత హాస్టల్ వసతి. Bus pass, train pass లు కల్పించుట.
*NSS క్యాంపులు, study hours Slip test, Unit test, Quarterly, Halfyearly & Pree final పరీక్షల నిర్వహణ.
*అతిపెద్డ విశాలమైన ఆటస్థలం. వివిధ క్రీడాంశాలలో ప్రత్యేక శిక్షణ.
*ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ న్యూఢిల్లీవారి నుండి 5 సం” స్కాలర్షిప్ అందించుట.
ఇంకా ఎన్నో, మరెన్నో ….. అందుకే
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేర్పించండి.