Site logo

నాగంపేట పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ

జమ్మికుంట మండలం నాగం పేట గ్రామపంచాయతీ పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట ఎంపీపీ మమత ,మాజీ మార్కెట్ సభ్యులు తుమ్మేటి సమ్మిరెడ్డి,జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్. శ్రీ రామ్ శ్యామ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడట మే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలకు 10000 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను గత మూడు రోజులుగా వివిధ మండలాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండని వారికి ఎల్లవేళలా అండ గా ఉంటాడని వారు హర్షం వ్యక్తం చేశారు. జమ్మికుంట ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు అందుబాటులో ఉంటారని ప్రజలకు సూచన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగం పేట సర్పంచ్ చందుపట్ల స్వాతి కృష్ణారెడ్డి ఎం పి టి సి రాచపల్లి రాజయ్య య ఆటో డ్రైవర్ సంఘం అధ్యక్షులు మహేందర్ టిఆర్ఎస్ నాయకులు పంజాల సంతోష్ ,గ్రామ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ,రాస ముల్ల లక్ష్మణ్ గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు

Comments

  • No comments yet.
  • Add a comment