Site logo

కాంగ్రెస్ నాయకులవి శవ రాజకీయాలు – దేశిని కోటి

జమ్మికుంట: (మన జమ్మికుంట) ఈరోజు కొత్తపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ హమాలీ సంఘం అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ

ప్రజల కోసం ప్రజ ఆరోగ్యం కోసం కష్ట పడుతున్నా మంత్రి గారిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం ఏక వచనంగా మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారితో ఎలా వుండాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని తెలవని వారు ఒక గౌరవ ప్రజా మంత్రి అయినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారిని విమర్శించడం వింతగా ఉంది. నీ రాజకీయ లబ్ది కోసం రాజకీయ ఉనికి కోసం శవ రాజకీయాలు చేయడం మానుకో లేకుంటే రాబోయే రోజులో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని అన్నారు

ఈ కార్యక్రమంలో భోగంపాడు సర్పంచ్ తిరుపతి రెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు వీరన్న, రమేష్, రాము మరియు టిఆర్ఎస్ నాయకులు సదానందం శ్రీహరి రమేష్, సునీల్, వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment