ఇల్లంద కుంట ….. త్రేతాయుగమున శ్రీ సీతారామ లక్ష్మణసమేతుడైన రామచంద్రుడు అరణ్యవాస కాలమున ఇచ్చట తన తండ్రి గారు అయిన దశరథుని మరణ వార్త విని మిక్కిలి దుఖి:oచి ఇచ్చట గల ఇల్లందగింజల తో శ్రాద్ధకర్మ లొనరించినట్లు నేటికిని చెక్కు చెదరని “ఇల్లందవృక్షములు” సాక్షదారాల వలనరూఢీ అవుచున్నది .
ఇల్లంద వృక్ష చాయలలోనే శ్రీ సీతారామచంద్రస్వామి అవతరించినందువల్లనే ఈ గ్రామానికి “ఇల్లందకుంట” పేరు సిద్దించినట్లు ఆనాదినుండి నానుడి.
అత్యంత ఆకర్షనీయమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయం లో ని ఉత్సవ మూర్తులు సహితం ” స్వయం వ్యక్తమూర్తులు ” ఈ ఉత్సవమూర్తులకు ” పుట్టుమచ్చలు” కలిగి ఉండుట ఈ ఆలయ విశేషం
భ ద్రాచలం తర్వాత అంత సుప్రసిద్దిగాంచిన దేవాలయం గా ప్రసిద్ది చెందింది
శ్రీ సీతా రామస్వామి వారి కళ్యాణం ,బ్రమ్మోస్తవాలు ప్రతి సంవత్సరం రమణీయంగా విశేష జనసమూహం మద్యలో జరుగుచున్నవి ..