Site logo

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న – జమ్మికుంట లోకల్ న్యూస్

 

అసలే నిరుపేదలు ఆపై విధి వారిపై చిన్న చూపు చూసింది లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన కండరాల క్షీణత (మస్కులార్ డిస్క్రోపి ) అనే వ్యాధితో బాధ పడుతున్నారు వారు మంచానికే  పరిమితం అయ్యారు. వారిని  కాపాడుకొనేందుకు ఆ నిరుపేద దళిత తల్లి దండ్రులు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా కళ్ళ  నీళ్లు తెప్పిస్తాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెందిన నందిపాటు సమ్మయ్య -కరుణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ప్రణయ్ (16), వినయ్ (11) ఏళ్ల  వయసులో ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. వీరిని ఈ పేద తల్లి దండ్రులు తమ శక్తికి మించి ఎన్నో హాస్పిటల్ లు తిరిగినా  ఎలాంటి ప్రయోజనం లేక పోయింది. ఈ వ్యాధికి ఇప్పడి వరకు పూర్తిగా నయం చేసే ఎలాంటి  చికిత్స  అందుబాటులో లేదని వైద్యులు తెలిపినారు, కానీ ప్రస్తుతం వీరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరులో చికిత్స తీసుకొంటున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయకున్నా వ్యాధి పెరుగుదలను ఆపగలదని అక్కడి వైద్యులు తెలిపారు. వీరికి ప్రతి నెల మందులకు, రవాణా ఖర్చులు మరియు తిండి ఖర్చులకు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. 

పిల్లల తండ్రి సమ్మయ్య చిన్న టి   కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతేకాక ఇతను మరియు ఇతని భార్య కూడా అనారోగ్యముతో బాధ పడుతున్నారు.

వీరు ప్రతి నెల వేలూరు హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకోవాలంటే రోజు గడవడమే కష్టంగా ఉండే వీరికి పిల్లల చికిత్స ఏంతో  భారంగా తయారైంది.
పిల్లల్ని అలా చూస్తూ ఊరుకోలేక, చికిత్స చేయించలేక వారు పడే కష్టాల్ని చూస్తే కంట తడి పెట్టకుండా ఉండలేము.
వీరికి చేయూత  నిచ్చి  వారి చికిత్సకి ఆర్ధిక సహాయం చేసే దాతలకై  దీనంగా ఎదురుచూస్తున్న వీరికి తమ  వంతు సహాయం చేయగలరని  మనవి.

వారి చిరునామా 
నందిపాటు సమ్మయ్య, టి స్టాల్, ఐ. బి. గెస్ట్ గౌస్ ముందర, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా
CELL: 9704964049

బ్యాంకు అకౌంట్ నెంబర్ 
062410021005396, ఆంధ్ర బ్యాంకు, వీణవంక బ్రాంచ్.
IFSC CODE: ANDB0000624

Comments

  • No comments yet.
  • Add a comment