Site logo

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన 

T MASS FORUM జమ్మికుంట మండల కమిటి ఆద్వర్యంలో సైదాబాద్ గ్రామంలో పర్యటించినట్లు గ్రామంలోని స్థానిక సమస్యలు ప్రజలు టీ మాస్ బృందం దృష్టికి తీసుకొచ్చినట్లు మండల కన్వీనర్ శీలం అశోక్ తెలిపారు .మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ,వెంటనే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ,అలాగే అర్హులైన పేదలకి ఇంటి నివేశన స్థలాలకి ,పట్టాలు పంపిణి చేసి 9 సం,, లు గడిచిన పాలకులు హద్దులు చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అని ఇప్పటి గ్రామంలో స్మశానవాటిక కూడా ఏర్పాటు చేయలేదని ,భూమి లేని పేదలు చనిపోతే చెరువు కుంటలో, రైలు ట్రాక్ ప్రక్కన దహనం చేస్తున్నారు. అని మిషన్ కాకతీయ క్రింద పూటిక తీసిన కందిరేణి కుంట మత్తడి ఎత్తును తగ్గించిన కాంట్రాక్టర్ పై ఇప్పటికీ చర్యలు లేవు .అని గ్రామంలోని 10వ వార్డులో మోటారు బోరు చెడిపోయి ,2 నెలలు దాటిన రిపేరు చేయించడం లేదని 7వ వార్డులో మురికి కాలువ నిర్మాణం లేక దోమలతో ప్రక్కన ఇంటివాసులు ఇబ్బండులేదుర్కుంటున్నారు .బ్లీచింగ్ పౌడర్ వేయించట్లేదు, ట్యాంకు నిండి వాటర్ రాత్రంతా క్రిందనే పోయినా బంద్ చేసే నాదుడే లేడని ప్రజల నుండి తదితర సమస్యలను గుర్తించినట్లు ,వీటి పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిదులకి వినతి పత్రాలు ఈ నెల 16వ తేదీన ఇవ్వనున్నట్లు లేనియెడల 19వ తేదీన MRO ఆఫీస్ ముట్టడి చేయునున్నట్లు తెలిపారు ,ఈ కార్యక్రమంలో TMASS మండల నాయకులు కొప్పుల శంకర్, శాగార్ల కుమార్, రామగోని అరవింద్ ,దాసరి మొగలి ,కన్నాం సదానందం ,అంజి ,నెల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment