టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఈ రోజు టాస్క్ ఫోర్సు అధికారులు మధ్యాన్నం నుండి రాత్రి వరకు తినుబండారాల దుకాణాలు, ఆయిల్ షాపులు, కిరాణం దుకాణాలు, ఏజెన్సీస్ లపై దాదాపు 7 గంటల పాటు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్పైరీ తేది అయిపోయిన సరుకులు పెద్ద ఎత్తున లభించాయి. వీటితో పాటు 1,05,000 రూపాయల విలువగల గుట్కా పాకెట్లు, ౩౦౦ కిలోల కల్తీ కారం పొడి, 5 క్వింటాళ్ళ రేషన్ బియ్యం, 20 కిలోల కల్తీ ఆయిల్, 100 లీటర్ల కిరోసిన్ తో పాటు ఎక్పైరీ అయిన 10 లక్షల విలువ కలిగిన సరుకులు లభించాయి. ఈ సరుకులను అధికారులు తగుల బెట్టడం జరిగింది. అధికారులు మాట్లాడుతూ ప్రజలు కల్తీ సరుకులపై అప్రమత్తంగా ఉండాలని, ఈ దాడులు ఎప్పటికి జరుగుతాయని ఏదైనా కల్తీ సరుకులపై సమాచారం తెలిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని తెలిపారు.
ఈ దాడుల్లో CI గౌస్ బాబా, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృత శ్రీ మరియు పలువురు SI లు, సిబ్బంది పాల్గొన్నారు.