ఒక్క సెట్టింగ్ తో మీ ఫోన్ లో కాంటాక్ట్స్ ఎప్పటికీ భద్రం

మొబైల్ ఫోన్ మార్చి నపపుడల్లా లేదా పోయినప్పుడు చాలా మంది కి ఏర్పడే మొట్ట మొదటి సమస్య ఫోన్ నెంబర్స్ లేక పోవడం. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫోన్ నెంబర్స్ రాసి భద్ర పరిచే అలవాటు లేకుండా పోయింది.
మరి ఈ సమస్యకు చాలా మంచి పరిష్కారం ఉంది. సులభంగా ఎప్పటికప్పుడు మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఆన్ లైన్ లో అనగా వర్చ్యువల్ గా స్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి ఆప్ కానీ సాప్ట్ వేర్ గాని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం ఫోన్ లోనే అందుబాటు లో ఉంటుంది. మనం చేయాల్సింది ఆ ఆప్షన్ ను ఉపయోగించుకోవడం మాత్రమే.
దీనికై మీ మొబైల్ సెట్టింగ్స్ ఆప్షన్ కు వెళ్ళాలి.
తర్వాత అకౌంట్స్ అండ్ సింక్ వెళ్ళండి.
->Settings
->Accounts and Sync

ఇక్కడ సింక్ కాంటాక్ట్స్ ఆప్షన్ ను చెక్ చేయండి.
మీ ఇంటర్నెట్ డాటా లేదా WiFi ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు వెంటనే మీ కాంటాక్ట్స్ మీ మెయిల్ ఐడి కి సింక్ చేయబడుతాయి. అంతే కాక ఎప్పటకప్పుడు మీ కాంటాక్ట్స్ అప్ డేట్ అవుతూనే ఉంటాయి.
మీ మొబైల్ ను మార్చి నాపుడు, కొత్త మొబైల్ ను తీసుకున్నపుడు మీ మెయిల్ ఐడి మళ్లీ ఆడ్ చేయగానే మొత్తం ఫోన్ నంబర్స్ తిరిగి పొందవచ్చు.
అంతే కాక మొబైల్ పోయినప్పుడు వేరే మొబైల్ అందుబాటులో లేకున్నా కూడా మీరు మీ మెయిల్ ఐడి లాగిన్ అయ్యి కాంటాక్ట్స్ లిస్ట్స్ ను పొందవచ్చు.
ఈ సదుపాయం andriod మరియు ios iPhone లలో ఉంటుంది.
ఒక సారి మీ మొబైల్ లో ఈ feature enable చేసి ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఏదైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో అడగండి.
@anwartechnews

#jammikuntanews #manajammikunta.com #jammikunta

Leave A Comment