మొదలైన చిన్న బతుకమ్మ వేడుకలు
జమ్మికుంట పట్టణంలో చిన్న బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ లను తీసుకువచ్చి స్థానిక బొమ్మల గుడి ప్రాంతంలో తమ ఆట పాటలతో బతుకమ్మను కొలిచారు.
బొమ్మల గుడి ప్రాంతం పూర్తిగా జన సందోహంగా మారిపోయింది. రాబోయే దసరా ఉత్సవాలకు చిన్న బతుకమ్మతో ఆహ్వానం పలికారు.