సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక గాంధీ చౌరస్తాలో ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా టెస్టులు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ ఉచితంగా చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు 7500 నగదు ఇవ్వాలని, రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణ ఆపివేయాలని అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 6000 నుండి ఇ 18000 చేయాలని, కరోనా సందర్భంగా ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నిరుపేదలకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలని, ఉపాధి పని దినాలు 200 రోజులు కల్పించాలి, ప్రతి రోజు కు 600 కూలీ చెల్లించాలని తదితర డిమాండ్లతో సి ఐ టి యు, ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కన్నం సదానందం, రావుల ఓదేలు, పుల్లూరి రాములు లు, కుసుమ రవి, బండ సురేష్, నవీన్ , కుమార్ తదీతరులు పాల్గొన్నారు.