Site logo

హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించేవరకు పోరాటం చేస్తాం – బార్ అసోసియేషన్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం
హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్  న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో  హుజురాబాద్ ను నారాయణ పేట, ములుగు తో పాటు నూతన జిల్లాగా ప్రకటించాలని దీనికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్.
భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న హుజురాబాద్ ను పి.వి. జిల్లా గా ప్రకటించాలని
బార్ అసోసియేషన్ తరపున హుజురాబాద్ ఆర్ డి ఓ గారికి ఈరోజు మెమోరండం ఇవ్వడం జరిగింది. ప్రకటించని ఎడల న్యాయవాదులు మరియు అఖిలపక్షాల రాజకీయ పార్టీలతో వివిధ సంఘాలతో కలుపుకొని హుజురాబాద్ పీవీ జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని న్యాయవాదుల డిమాండ్. ఈ కార్యక్రమంలో సమ్మిరెడ్డిరాజు శ్యామ్ సుందర్ ఎం సదయ్య పి సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి ఎం శ్రీనివాస్ సాంబమూర్తి భద్రయ్య లింగారెడ్డి పవన్ కుమార్ జై కృష్ణ దాదాపు 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment