Site logo


ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన గాయత్రీ బ్యాంక్

జమ్మికుంట: ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్, జమ్మికుంట శాఖ వారు తమ నిర్భయ సేవింగ్ ఖాతా దారుడైన బత్తుల శ్రీనివాస్ ఇటీవల ప్రమాదంలో మరణించడంతో మృతుని నామిని అయిన బత్తుల సరోజన కి 1 లక్ష రూపాయల చెక్కును పంపిణీ చేశారు. బత్తుల శ్రీనివాస్ ఒక ప్రమాదంలో మరణించారు. మృతునికి ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ యందు గల గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా పై ప్రమాద భీమా సౌకర్యం ద్వారా నామిని అయిన బత్తుల సరోజన కి 1 లక్ష రూపాయల చెక్కును TSNPDCL ADE CH.రాజేందర్, AE V. సురేశ్వరాచారి మరియు జమ్మికుంట బ్రాంచి మేనేజర్ శ్రీ కునమల్ల రవీందర్ చేతుల మీదుగా అందజేశారు.

ఆనంతరం బ్రాంచ్ మేనేజర్ శ్రీ కునమల్ల రవీందర్ మాట్లాడుతూ వినియోగదారులకు MICRO ATM, AEPS సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. తక్కువ వడ్డికే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా రూ౹౹ 3,400 /- తో ఋణాలను అందిస్తున్నారని, అలాగే రైతులకు వ్యవసాయ ఋణాలను కూడా అందిస్తున్నారని తెలియజేశారు. జమ్మికుంట పరిసర గ్రామాలలో 21 బ్యాంకింగ్ కరెస్పాoడెంట్ లను నియమించారని, తద్వారా పెన్షనర్లు మరియు ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరెస్పాoడెంట్ ల వద్ద బ్యాంక్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలిసిన ఫోటో మరియు జిరాక్స్ లను బ్యాంక్ యందే ఉచితంగా అందిస్తున్నామని , వ్యాపారస్తులకు వ్యాపార వృద్ది కి ఋణాలను అందిస్తున్నామని వినియోగదారులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవాలసిందిగా కోరారు.

ఈ సందర్భంగా TS NPDCL ADE CH. రాజేందర్ మరియు AE V.సురేశ్వరాచారి మాట్లాడుతూ ఖాతాదారులకి కనీస డిపాజిట్ తొనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద మరియు మధ్యతరగతి వినియోగదారులకు ప్రమాద భీమా కలిపిస్తూ వారికి అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. గాయత్రీ బ్యాంక్ వినియోగదారుల ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తుందని అభినందించారు.24 గంటలు ATM ల లో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా జమ్మికుంట మరియు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తుందని అన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment