Site logo

జమ్మికుంటలో వైద్యం వికటించి మహిళ మృతి?

తేది 11-08-2017

కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో జమ్మికుంట మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ లో ఓ మహిళ వైద్యం వికటించి మృతి చెందింది. చిన్న కోమటి పల్లి కి చెందిన సుజాత, తిరుపతి దంపతులకు ఒక కూతురు ఒక కుమారుడు కలరు. 10 రోజుల క్రితం గర్భ సంచి ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. ఐదు రోజుల క్రితం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరిగింది. కడుపు ఉబ్బి కడుపు నొప్పి రావడంతో తిరిగి నిన్న హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చింది. పేగు మెలిక పడిందని ఆపరేషన్ చేయాలని భర్త తిరుపతి ని ఆపరేషన్ కోసం రక్తం అవసరమని చెప్పి వరంగల్ కు పంపారు. తర్వాత మళ్ళి ఫోన్ చేసి వరంగల్ లోనే ఉండు మీ భార్యని MGM ఆసుపత్రికి పంపిస్తున్నామని చెప్పారు. భర్తకు అనుమానం వచ్చి చూస్తే తన భార్య మరణించి ఉందని గమనించాడు. హాస్పిటల్ లో జాయిన్ చేసే సమయంలో బాగానే మాట్లాడుతూ ఉందని ఈ ఆసుపత్రి వైద్యుల వైద్యం వల్లనే  తన భార్య మరణించిందని భర్త మరియు బంధువులు ఆరోపిస్తున్నారు. 

Comments

  • No comments yet.
  • Add a comment