ఎన్నో ఏళ్ళ కల – త్వరలో సాకారం కాబోతుంది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.
త్వరలో దీన్ని ప్రారంభిస్తారని జమ్మికుంట ప్రజలు ఆకాంక్షిస్తున్నారు .
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల కొతపల్లి, ధర్మారం, ఇల్లందకుంట గ్రామాలతో పాటు ఆ మార్గంలో దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది . ప్రస్తుతం ఫ్లై ఓవర్ లేక పోవడం వల్ల రైల్వే గేటు వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది . ముఖ్యంగా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోడానికి మార్కెట్ కు తీసుకు రావాలంటే చాలా గ్రామాల నుండి వచ్చే రైతులు రైల్వే గేటు గంటల తరబడి ఆగాల్సి వస్తుంది .