స్థానిక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలను ఈటెల జనసేన మరియు TRSV ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణి చేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈటెల జనసేన 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమన్నారు. ఈటెల జనసేన ఏర్పాటుకు సహకరించిన వారందరికీ అలాగే దీని వ్యవస్తాపక అద్యక్షులు ఎనగంటి నరేష్ యాదవ్ గార్కి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలపడం జరిగింది .ఈటెల జనసేన అనేది పార్టికి మరియు ప్రజలకు మరియు గౌ,, ఈటెల రాజేందర్ గార్కి అనుసందానంగా పనిచేస్తుoదని అన్నారు. ప్రభుత్వం మరియు మంత్రివర్యులు చేస్తున్న అభివృధిని క్సేత్రస్థాయిలో వివరించడం జరిగుతుందన్నారు . అలాగే ఉడత భక్తిగా పేద ప్రజలకు ,విద్యార్థులకు ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తూ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్దన్నారు . ఈ కార్యక్రమంలో ఈటెల జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొడం రాజు నియోజకవర్గ అద్యక్షులు కొత్తకొండ వెంకటేష్, TRSV రాష్ట్ర కార్యదర్శి జువ్వాజి కుమార్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము అశోక్ ,చారి ,అఖిల్ ,ప్రశాంత్ ,చిరంజీవి ,సందీప్, ధనుంజయ్ ,అరవింద్ ,రాజేందర్,తదితరులు పాల్గొన్నారు. Manajammikunta News