ఉద్యమ కారుడికి మద్దత్తు గా దుదేకుల కులస్తులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ అంకూస్ కి ఇవ్వాలని దూదేకుల సంఘ నాయకుల డిమాండ్ హుజురాబాద్ :హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని మాజిద్ కౌసర్ ఆవరణలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో దుదేకుల సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మా కుల ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవిస్తారని, రాజకీయంగా ఇప్పటి వరకు మా సామాజిక వర్గానికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని, ఈసారి మా కులం నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యావేత్త గా గుర్తింపు ఉన్న మహమ్మద్ అంకూస్ (జమ్మికుంట )గారికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గా తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌసిక్ రెడ్డి, తెరాస నియోజకవర్గం ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో హుజురాబాద్ మండల అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అక్బర్, నాయకులు రాజమోహమ్మద్, రహిమోద్దీన్, అంకూస్, అబద్దుల్లా, ఫయాజ్,రజ్జుమియా,రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment