Site logo

ప్రాణాలకు తెగించి రెండు నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్ – జమ్మికుంట సి.ఐ. సృజన్ రెడ్డి సాహసం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో చేద బావిలో పూడిక తీయడం కోసం దిగిన ఇద్దరు కూలీలు బావి ఇరుకుగా ఉండడం, నీరు చాలా లోతులో ఉండడంతో మరియు వేసవి కాలం అవడం వల్ల ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన ఈ ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడిన జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి.
వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని మేకల భద్రయ్య తన చేత బావిలో పూడిక నిండి ఉండటంతో వర్షాకాలం రావడానికి ముందే పూడికతీత చేయాలని కూలీ లైనా అయినా ఓల్లాల మల్లయ్య (42), మారపల్లి రవీందర్ (45) లను మాట్లాడుకున్నాడు.
ఈ రోజు ఉదయం మంచి నీటి బావి లో పూడిక తీయడం కోసం లోపలికి దిగిన మల్లయ్య, రవీందర్ లకు కొద్ది సేపటికే బావి ఇరుకుగా ఉండటం, లోతుగా ఉండటం మరియు ఎండ వేడికి ఆక్సిజన్ అందక ఊపిరి ఆడక పోవడంతో వారు పైన ఉన్న వారికి తెలపడంతో వారు 108 కు మరియు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది,108 సిబ్బంది మరియు గ్రామ ప్రజలు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడ వారి పరిస్తితి చూసిన ఎవరు బావి లోపలికి దిగే సాహసం చేయలేదు. కానీ అక్కడకు చేరుకున్న జమ్మికుంట సి.ఐ. సృజన్ రెడ్డి వెంటనే స్పందించి కేవలం చిన్న తాడు సహాయంతో లోపలికి దిగారు. లోపలికి దిగిన సి.ఐ. కొంత సేపు ఎలాంటి పిలుపు లేకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. కానీ కొద్ది సేపటికే వారికి తాడు కట్టిన సి.ఐ. పైనకూ లాగండి అని అనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోపల ఫైర్ సిబ్బంది చేరుకొని కొంత మేరకు నిచ్చెనతో సహాయం అందించారు. అలా ఇద్దరినీ పైనకు తీసుకు వచ్చి రెండు నిండు ప్రాణాల్ని కాపాడారు. ప్రధమ చికిత్స అనంతరం బావి నుండి బయట పడిన మల్లయ్య, రవీందర్ లు కొలుకుంటున్నారు.
ఎంతో దైర్య సాహసాలు ప్రదర్శించిన సి.ఐ.సృజన్ రెడ్డి సాహసాన్ని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
ఎంతో మంది పోలీసులకు ఆదర్శంగా నిలిచిన సి. ఐ. సృజన్ రెడ్డి.

Comments

  • No comments yet.
  • Add a comment